Header Banner

శివాలయ దర్శనానికి వెళ్లిన భక్తులపై ఏనుగుల దాడి: 3 మంది మృతి, 2 మంది పరిస్థితి విషమం! మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం!

  Tue Feb 25, 2025 11:40        Others

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల గుంపు భక్తులపై దాడి చేసి బీభత్సం సృష్టించింది. శివరాత్రి సందర్భంగా గుండాలకోన శివాలయానికి వెళ్లుతున్న భక్తులపై ఏనుగులు ఆకస్మికంగా దాడి చేయగా, ముగ్గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, వారిని స్థానికులు తిరుపతి దవాఖానకు తరలించారు. మృతులు రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

 

ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీపై మరో భూకబ్జా కేసు నమోదు! హైకోర్టు న్యాయవాది భార్య ఫిర్యాదు!

 

ఈ ఘటనలో 14 మంది భక్తుల బృందం గుండాలకోన నుంచి తలకోన వైపుగా నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యంలో ఏనుగుల గుంపు ఎదురైంది. ఒక్కసారిగా దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది భక్తులు తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ విషాదకర సంఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

శివరాత్రి సందర్భంగా గుండాలకోనలోని మల్లేశ్వరాలయంలో అనేక భక్తులు దర్శనానికి వస్తారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు, బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #elephantattack #